అమ్మ నన్ను చర్చికి లాక్కెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయి!: నటి సమంత

తన తల్లి తనను బలవంతంగా చర్చికి లాక్కెళ్లిన నాటి రోజుల గురించి ప్రముఖ సినీ నటి సమంత అక్కినేని గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ప్రస్తావించారు. ‘మా అమ్మ నన్ను చర్చికి లాక్కెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయి. ప్రతి వారంలో బుధ, శని, ఆదివారం చర్చికి తీసుకెళ్లేది. నాకు, అస్సలు ఇష్టముండేది కాదు. అమ్మ బలవంతంతో వెళ్లేదాన్ని. కానీ, ఆమె ప్రార్థనలే నన్ను రక్షించాయి. మై అమేజింగ్ మమ్’ అంటూ ఆ ట్వీట్ లో సమంత చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ తో పాటు చర్చి వద్ద దిగిన తన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.
Go Back to Shorts
samantha
akkineni

More Telugu News