narasimhan: తనపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై నరసింహన్ స్పందన

షార్ట్స్‌లో చూడండి
ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల నేతలను పట్టించుకోకుండా, అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందిస్తూ ఒకే కుటుంబంలో ఉన్న పెద్దలు, పిల్లల మధ్య వివాదాలు, మనస్తాపాలు ఉండటం సహజమేనని అన్నారు.

ఇది కుటుంబ వ్యవహారంలాంటిదని, దీని గురించి బయట మాట్లాడరాదని చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నరసింహన్ పైవిధంగా సమాధానమిచ్చారు. హోంశాఖ అధికారులతో విభజన చట్టంలోని అంశాలపై చర్చించానని తెలిపారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
narasimhan

More Telugu News