రజనీకాంత్ కు బాడీగార్డ్ గా ఉంటానని చెప్పా!: లారెన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ కు బాడీగార్డ్ గా ఉంటానని చెప్పా!: లారెన్స్

  • నాకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వద్దని చెప్పా
  • రజనీకి బాడీగార్డ్ గా ఉండడం కన్నా మించిన పని మరొకటి లేదు
  • నా తలైవా కోసం ఏదైనా చేస్తాను : లారెన్స్
రజనీకాంత్ కు బాడీగార్డ్ గా వుండడం కన్నా మించిన పని మరోటి లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ అన్నారు. మధురైలో ఏర్పాటు చేసిన రజనీ ఫ్యాన్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. ‘నేను మీకు బాడీగార్డ్ గా ఉంటానని తలైవాతో అంటే.. అందుకు, ఆయన ‘సరే’ అన్నారు’ అని లారెన్స్ అన్నాడు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వద్దని, ఆయనకు బాడీగార్డ్ గా ఉండటానికి మించిన పని మరొకటి లేదంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తాను, తన కుటుంబసభ్యులు కలిసి డ్యాన్స్ చేశామని, అదే కనుక, తాను నటుడిని కాకపోయి ఉంటే, ఈ వేడుకను వీధిలోకి వెళ్లి సెలబ్రేట్ చేసుకునేవాడినని అన్నాడు. రజనీ ఫ్యాన్స్ మీట్ కు తనను ఆహ్వానించినప్పుడు, ‘నా తలైవా కోసం ఏదైనా చేస్తాను’ అని వారితో చెప్పానని లారెన్స్ గుర్తుచేసుకున్నాడు.
rajani
lawrence raghava

More Telugu News