స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ ను సమీక్షించనున్న సుప్రీంకోర్టు
- ప్రాథమిక హక్కుల కోణంలో తాజా పిటిషన్
- స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు
- రాజ్యాంగ ధర్మాసనానికి పిటిషన్ నివేదన
అయితే, గోప్యత అన్నది ప్రాథమిక హక్కులో భాగమేనని ఇటీవలే ఆధార్ విషయంలో సుప్రీకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో... దీన్ని ఆధారంగా చేసుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ వర్గాలు (ఎల్జీబీటీక్యూ) తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులను చూసి భయపడాల్సి వస్తోందని వివరించాయి. స్వలింగ సంపర్కాన్ని నేరమంటున్న సెక్షన్ ను కొట్టేయాలని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.