prabhas: హిందీ అంత బాగా రాదు .. భవిష్యత్తులో విలన్ గా కూడా చేస్తానేమో: ప్రభాస్

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' తరువాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో తాను తెలుగులో చేసే సినిమాలు ఇతరభాషల్లోను విడుదలయ్యేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న 'సాహో' కూడా హిందీలో రిలీజ్ కానుంది. ఆ తరువాత ఓ బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు ఇంతకుముందే ఆయన చెప్పాడు.

అయితే తనకి హిందీ భాషా సమస్య ఉందని ప్రభాస్ అన్నాడు. హిందీని చదవగలను .. రాయగలను గానీ, ధారాళంగా మాట్లాడలేనని చెప్పాడు. అందువలన హిందీ సినిమా చేసినా తాను ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పలేకపోవచ్చనీ, త్వరలో ఈ సమస్యను అధిగమిస్తానని అన్నాడు. ఇక ఒకే సినిమా కోసం చాలా కాలాన్ని కేటాయించే ఛాన్సే లేదని తేల్చేశాడు. 'ఇప్పుడు కాదు గానీ .. భవిష్యత్తులో విలన్ గా చేస్తానేమో' అంటూ ఆ అవకాశాలు వున్నాయన్నట్టుగా ప్రభాస్ చెప్పుకురావడం విశేషం.   
Go Back to Shorts
prabhas

More Telugu News