అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన హీరోయిన్ సాయి పల్లవి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన హీరోయిన్ సాయి పల్లవి!

  • ఫిదా, ఎంసీఏతో అమాంతం పెరిగిన డిమాండ్
  • 2018లో డేట్స్ లేవంటున్న సాయి పల్లవి
  • 2019లో కావాలన్నా ఊహించని రెమ్యునరేషన్ డిమాండ్
ఒక్క సినిమాతో తెలుగింట్లో సొంత పిల్లలా మారిపోయిన 'ఫిదా' హీరోయిన్ సాయి పల్లవి, ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హీరో నానీకి జోడీగా నటించిన తాజా చిత్రం 'ఎంసీఏ' కూడా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం సాయి పల్లవికి డిమాండ్ అమాంతం పెరిగిపోయిందని సమాచారం.

ఆమె డేట్స్ కోసం పెద్ద సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయని, సాయి పల్లవి డేట్స్ క్యాలెండర్ లో ఈ సంవత్సరం ఖాళీ లేదని తెలుస్తోంది. పోనీ 2019లోనైనా ఆమె డేట్స్ తీసుకోవాలని కొందరు ప్రముఖ నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదిస్తే, రెమ్యునరేషన్ గా వారు ఊహించని మొత్తాన్ని అడిగిందని, దీంతో అవాక్కైన నిర్మాతలు వెనుదిరిగారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ విషయంలో నిజమెంత ఉన్నా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని సాయి పల్లవి తొందరగానే అర్థం చేసుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Sai Pallavi
Fida
MCA
Remunaration

More Telugu News