సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తెలుగులో తాప్సీకి మరో సినిమా 
  • ప్రభాస్ చిత్రానికి భారీ ఆఫర్ 
  • మలయాళ సినిమాలో సిద్ధార్థ్
  • అల్లు అర్జున్ కి తండ్రిగా యాక్షన్ కింగ్ అర్జున్!
*  అందాల తాప్సీ చేయనున్న తాజా తెలుగు చిత్రం షూటింగ్ ఈ నెల 10 నుంచి జరుగుతుంది. 'లవర్స్' ఫేం హరి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, తాప్సీ జంటగా నటిస్తున్నారు. ఇదిలా ఉంచితే, తాను నటిస్తున్న హిందీ చిత్రం 'సూర్మ' షూటింగును తాప్సీ ఇటీవలే పూర్తి చేసింది.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రానికి టీ సీరీస్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ వెర్షన్ల థియేట్రికల్ హక్కుల రూపంలో సదరు సంస్థ 240 కోట్ల మొత్తాన్ని ఆఫర్ చేసిందని, అయితే యూవీ క్రియేషన్స్ దానిని తిరస్కరించిందని సమాచారం.
*  హీరో సిద్ధార్థ్ తొలిసారిగా 'కుమార సంభవం' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తనకు మలయాళంలో తొలి చిత్రం కాబట్టి ఇది తనకు స్పెషల్ ఫిలిం అవుతుందని సిద్ధూ పేర్కొన్నాడు. దీనికి రతీష్ అంభట్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  అల్లు అర్జున్ కి సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ తండ్రిగా నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రంలో అర్జున్ ఇలా తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.    
Tapsi
Prabhas
Allu Arjun

More Telugu News