సంక్రాంతి సందడిలోకి 'సాక్ష్యం' ఫస్టులుక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతి సందడిలోకి 'సాక్ష్యం' ఫస్టులుక్!

  • షూటింగు దశలో 'సాక్ష్యం'
  • వారణాసి .. దుబాయ్ షెడ్యూల్స్ పూర్తి 
  • ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు, మీనా  
'డిక్టేటర్' సినిమాతో బాలకృష్ణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రీవాస్, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో 'సాక్ష్యం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా నుంచి సంక్రాంతికి ఫస్టులుక్ ను వదలాలని ఆలోచన చేస్తున్నారు.

 ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించాలనే ఉద్దేశంతో వున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కావడం వలన, మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించనున్నారు. ఇప్పటికే కాశీ .. దుబాయ్ లలో చిత్రీకరణను ముగించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో జగపతిబాబు .. మీనా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.     
srinivas
pooja hegde

More Telugu News