నాని కెరియర్లో చోటుచేసుకున్న మరో రికార్డ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని కెరియర్లో చోటుచేసుకున్న మరో రికార్డ్

  • నాని కథల ఎంపికపై ప్రేక్షకుల నమ్మకం
  • నాని మార్కెట్ పై నిర్మాతలకి గురి 
  • ఈ ఏడాదిలో వచ్చిన మూడు సినిమాలు
  • అన్నీ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నాయి      
చిన్న కథానాయకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన నాని, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ ప్రయాణంలో ఆయనకి వరుస సక్సెస్ లు దక్కుతూ వస్తున్నాయి. దాంతో నానిపై నిర్మాతలకే కాదు .. ప్రేక్షకులకు కూడా నమ్మకం పెరుగుతూ వస్తోంది. నాని ఓకే చెప్పిన ప్రతి కథ .. ఆయన నమ్మకాన్ని వృథా చేయకుండా విజయాలను దోసిట పెడుతున్నాయి.

 ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'నేను లోకల్' .. 'నిన్నుకోరి' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' చిత్రాలు మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నాయి. యూఎస్ లో మిలియన్ డాలర్ మార్క్ ను అందుకోవడానికి పెద్ద హీరోల సినిమాలే నానా అవస్థలు పడుతుంటాయి. అలాంటిది ఈ ఏడాది నాని చేసిన మూడు సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ మార్కును చేరుకొని, ఆయన కెరియర్లో అరుదైన రికార్డును నమోదు చేశాయి. మొత్తానికి తానేమిటన్నది నాని మరోమారు నిరూపించాడు.      
nani
sai pallavi

More Telugu News