ఓవర్సీస్ లోను తగ్గని 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' దూకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవర్సీస్ లోను తగ్గని 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' దూకుడు

  • తెలుగు రాష్ట్రాల్లో 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' జోరు
  • ఓవర్సీస్ లోను అదే దూకుడు 
  • గురువారం నాటికి అక్కడ 6.03 కోట్ల వసూళ్లు
సక్సెస్ అనేది ఇప్పుడు నాని ఇంటిపేరుగా మారిపోయింది. దాంతో ఆయన జోరు ఒక రేంజ్ లో కొనసాగుతోంది. రీసెంట్ గా వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కూడా ఆయన ఖాతాలో సక్సెస్ ను జమ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఇక ఓవర్సీస్ లోను అదే దూకుడును కొనసాగిస్తోంది. గురువారం నాటికి ఈ సినిమా అక్కడ 6.03 కోట్లను వసూలు చేసింది. నాని - సాయిపల్లవి జోడీ, భూమిక నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది నానికి హ్యాట్రిక్ హిట్ ను అందిస్తే, నిర్మాతగా దిల్ రాజుకు 6వ సక్సెస్ ను అందించింది. 'శతమానం భవతి' .. 'నేను లోకల్' .. 'డీజే' .. 'ఫిదా' . 'రాజా దిగ్రేట్' హిట్స్ సరసన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' కూడా చేరిపోయాడు.  
nani
sai pallavi

More Telugu News