us consul general: మెట్రో రైలు ఎక్కిన యూఎస్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ కేథ‌రీన్‌!

షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం కాన్సుల్ జ‌న‌ర‌ల్ కేథ‌రీన్ హ‌డ్డా గురువారం మెట్రోరైలు ప్ర‌యాణం చేశారు. మెట్రో ప్రారంభ‌మైన త‌ర్వాత ఆమె మొద‌టిసారి మెట్రో ఎక్కారు. రసూల్‌పురా నుంచి మెట్టుగూడ వ‌రకు ఆమె ప్ర‌యాణించారు. ప్ర‌యాణంలో భాగంగా స‌హ ప్ర‌యాణికుల‌తో ఆమె ముచ్చ‌టించారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల‌కు కల్పించిన వసతులు, సౌకర్యాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆమెకు వివరించారు. ఆమెతో పాటుగా అమెరికా రాయబార కార్యాలయం అసిస్టెంట్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ ఆకాశ్‌ సూరీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ప్ర‌యాణించారు. మెట్రోలో ప్ర‌యాణం చాలా బాగుంద‌ని ఆమె తెలిపారు.
Go Back to Shorts
us consul general
catherine
metro

More Telugu News