వరల్డ్ నెం. 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన విశ్వనాథన్ ఆనంద్!
- రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్ పై చేయి
- రియాద్‌లో జరిగిన పోటీ
- తొమ్మిది మ్యాచుల్లో ఐదింట ఆనంద్ గెలుపు
ఆట ప్రారంభంలోనే దూకుడు ప్రదర్శించిన ఆనంద్, కేవలం 34 ఎత్తుగడల్లోనే ఆటను పూర్తి చేశారు. కార్ల్‌సన్‌ని ఓడించడానికి ముందు రష్యాకు చెందిన వ్లాదిమిర్ ఫెదోసీవ్‌తో మ్యాచ్‌ను ఆనంద్ డ్రాగా ముగించారు. అలాగే వ్లాదిమిర్ క్రామ్నిక్, వాంగ్ హోలతో జరుగుతున్న మ్యాచుల్లో ఆనంద్ ముందంజలో ఉన్నారు.