పెటా 'ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా అనుష్క శ‌ర్మ‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెటా 'ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా అనుష్క శ‌ర్మ‌

  • ప్ర‌క‌టించిన పెటా అసోసియేట్ డైరెక్ట‌ర్‌
  • జంతువుల రక్షణ కోసం ప్ర‌చారం చేస్తున్న అనుష్క‌
  • నుష్ వ‌స్త్రాల బ్రాండ్ ద్వారా కూడా ప్ర‌చారం
 బాలీవుడ్ కొత్త పెళ్లికూతురు అనుష్క శ‌ర్మ‌ను పీపుల్ ఫ‌ర్ ఎథిక‌ల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమ‌ల్స్ (పెటా) 'పర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా ప్ర‌క‌టించింది. వెజిటేరియ‌న్ ఆహారం మాత్ర‌మే తీసుకునే అనుష్క శ‌ర్మ దీపావ‌ళి స‌మ‌యాల్లో బాణసంచా కార‌ణంగా శునకాలకు క‌లిగే ఇబ్బంది గురించి ప్ర‌చారం చేసినందుకు ఆమెకు ఈ గౌర‌వాన్ని ఇచ్చిన‌ట్లు పెటా అసోసియేట్ డైరెక్ట‌ర్ సచిన్ బంగేరా తెలిపారు.

అంతేకాకుండా ముంబైలో బండ్ల‌ను లాగే గుర్రాల‌కు కూడా స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌ని అనుష్క ప్ర‌చారం చేసింది. అలాగే త‌న వ‌స్త్రాల బ్రాండ్ నుష్ ద్వారా అనుష్క జంతుహింస చేయొద్ద‌ని ప్ర‌చారం చేసింది. అందుకోసం ప్ర‌త్యేకంగా ఓ క్లాత్‌లైన్‌ని కూడా విడుద‌ల చేసింది. గ‌తంలో అనుష్క శ‌ర్మ‌ను పెటా హాటెస్ట్ వెజిటేరియ‌న్ సెలెబ్రిటీగా కూడా గుర్తించిన సంగ‌తి తెలిసిందే.
peta
Anushka Sharma
person of the year

More Telugu News