ఎమ్మెల్యే జేసీ ఆగడాలపై చంద్రబాబు స్పందించరే?: సీపీఐ నేత రామకృష్ణ
- పోలీసులపై దుర్భాషలాడిన ప్రభాకర్ రెడ్డి తీరుపై మండిపడ్డ నేత
- ‘అనంత’లో సామాన్యులకే కాకుండా పోలీసులకూ రక్షణ లేదు
- పోలీసులకు కూడా గన్ మెన్లను నియమించాల్సిన పరిస్థితి
కాగా, ఎంపీ జేసీపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర విమర్శలు చేయడం విదితమే. దీంతో, జేసీ అనుచరుడు ఒకరు స్వరూపకు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కి ఫోన్ చేసి దుర్భాషలాడారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు జేసీ అనుచరుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి పోలీసులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.