కృష్ణంరాజు గారి మనస్తత్వమే ప్రభాస్ కి వచ్చింది: కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి
- ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు
- సరదాగా ఉండటమంటే ఆయనకి ఇష్టం
- అందరికీ కృష్ణంరాజు అండగా నిలిచారు
"మొదటి నుంచి కూడా కృష్ణం రాజు గారు ఆయన ఫ్యామిలీలోని వాళ్లందరికీ గాడ్. బ్రదర్స్ .. సిస్టర్స్ .. మేనకోడళ్లు .. పెదనాన్నగారి పిల్లలు .. చిన్నాన్న గారి పిల్లలు .. ఇలా వీళ్లు .. వాళ్లు అని కాదు, అందరికీ అండగా నిలబడుతుంటారాయన. 'దశరథ మహారాజుకి రాముడు ఎలాగో .. నాకు నా కొడుకు అలాగమ్మా' అని మా మామగారు నాతో అంటుండేవారు. 'అలాంటి కొడుకును కన్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని' అనేవారు. మా మామగారు నన్నెంతో అభిమానంతో చూసుకునేవారు. కృష్ణంరాజు గారిని చాలా బాగా చూసుకుంటాననే నమ్మకం నాపై మా మామగారికి ఉండేది" అని చెప్పుకొచ్చారు.