నాని చెప్పిన మాట నిజమే అనేస్తున్నారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని చెప్పిన మాట నిజమే అనేస్తున్నారు!

  • ఈ రోజే రిలీజైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'
  • నాని నటనకు మంచి మార్కులు 
  • పబ్లిక్ నుంచి దక్కుతోన్న ప్రశంసలు
నాని కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నాని వదినగా భూమిక కీలకమైన పాత్రలో కనిపించింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా చూసినవాళ్లు .. నాని చెప్పిన మాట నిజమేనని అంటున్నారు.

ఇటీవల 'హనుమకొండ'లో నిర్వహించిన ఈ సినిమా ఫంక్షన్లో నాని మాట్లాడుతూ, ప్రతి 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'  హీరో పాత్రలో తనని తాను చూసుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. అది నిజమేననీ .. అంత సహజంగా నాని నటించాడని అంటున్నారు. అన్నయ్యను అమితంగా ప్రేమించే తమ్ముడిలా .. వదినను అభిమానించే మరిదిగా .. మనసిచ్చిన అమ్మాయిని దక్కించుకునే ప్రేమికుడిగా .. విలన్ బారి నుంచి వదినను కాపాడుకునే మరిదిగా నాని చూపిన వేరియేషన్స్ అద్భుతం అంటున్నారు. డాన్స్  .. ఫైట్స్ లోను ఆయన తనదైన శైలిలో మెప్పించాడని చెబుతున్నారు.       
nani
sai pallavi
bhoomika

More Telugu News