ravireja: సంక్రాంతి బరిలోకి దిగేస్తున్న రవితేజ!

షార్ట్స్‌లో చూడండి
'రాజా ది గ్రేట్' హిట్ కావడంతో రవితేజ మాంచి ఉత్సాహంతో వున్నాడు. తన తదుపరి సినిమా 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సంక్రాంతికి ఈ సినిమాను తప్పకుండా తీసుకురావాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారనేది తాజా సమాచారం.

పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' .. బాలకృష్ణ 'జై సింహా' .. సూర్య 'గ్యాంగ్' సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోయాయి. 'అజ్ఞాతవాసి' జనవరి 10వ తేదీని ఫిక్స్ చేసుకుంటే, 'జై సింహా' .. 'గ్యాంగ్' సినిమాలు జనవరి 12వ తేదీని ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 'టచ్ చేసి చూడు' సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. రవితేజ సరసన రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.      
Go Back to Shorts
ravireja
rashi khanna
sheerath kapoor

More Telugu News