'వాహ్ రోహిత్ వాహ్'.. రోహిత్ శర్మపై ప్రముఖుల ప్రశంసల జల్లు!
- 115 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ
- మరో 35 బంతుల్లో మరో 100 పరుగులు
- చాలా గర్వంగా ఉంది-సెహ్వాగ్
- నీ బ్యాటింగ్ చూడడాన్ని ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తా-సచిన్
రోహిత్ శర్మను అభినందిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ... 'వాహ్ రోహిత్ వాహ్.. 35 బంతుల్లో సెకండ్ హండ్రెడ్.. చాలా గర్వంగా ఉంది రోహిత్ శర్మ' అని పేర్కొన్నాడు. 'నీ బ్యాటింగ్ చూడడాన్ని ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తాను' అంటూ సచిన్ టెండుల్కర్ పేర్కొన్నారు. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ బాదిన రోహిత్ ఘనతను గుర్తు చేస్తూ.. 'ఒకటి ఒకటి ఒకటి.. రెండు రెండు రెండు.. మూడు మూడు మూడు' అంటూ టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. 'మూడు డబుల్ సెంచరీలు.. ఏం కొట్టుడు'.. అంటూ దర్శకుడు గోపిచంద్ మలినేని పేర్కొన్నారు.