Prabhas: ప్రభాస్ 'ఎస్' అనగానే జాతకాల పరిశీలన: కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ వివాహంపై కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాన్ని జాతకాలు చూసిన తరువాతే కుదురుస్తామని అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, జాతకాలు పోల్చి చూడటం ప్రారంభిస్తామని, ప్రభాస్ ఎప్పుడు తన నోటి నుంచి ఎస్ చెబుతాడా అని ఎదురు చూస్తున్నామని అన్నారు.

 'జన్మ నక్షత్రాన్ని బట్టి సంపన్నుడివవుతావని మాత్రమే జ్యోతిష్యులు చెప్పగలరు. ఎంత సంపాదిస్తారన్న విషయాన్ని మాత్రం జ్యోతిష్యం చెప్పదు' అని వ్యాఖ్యానించిన ఆయన, దైవ నిర్ణయానికి స్వయం కృషి కూడా తోడు కావాల్సి వుంటుందని తెలిపారు. బాహుబలి షూటింగ్ జరిగినన్ని రోజూలూ ప్రభాస్ ఎంతో తపన, శ్రమ, అంకితభావాన్ని చూపించాడని, అందుకే దేవుడు కూడా దీవించాడని అన్నారు.
Go Back to Shorts
Prabhas
Krishnamraju
Marriage
Bahubali

More Telugu News