సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సమంతలో కాస్త మార్పు వచ్చిందట!
  • అమెరికాలో కమల్ మిక్సింగ్ పనులు 
  • విశాల్ 'అభిమన్యుడు' రిలీజ్ డేట్ ఖరారు 
  • సుమలత తనయుడు కూడా వస్తున్నాడు!
*  పెళ్లయ్యాక తనలో వ్యక్తిగతంగా మార్పు రాకపోయినప్పటికీ, వృత్తిపరంగా మాత్రం చిన్న మార్పు వచ్చిందని అంటోంది కథానాయిక సమంత. "సినిమాల ఎంపికలో నాకు మొదటి నుంచీ కాస్త చాదస్తం వుండేది. పెళ్లయ్యాక అది కాస్త ఎక్కువైంది. సినిమాలు ఒప్పుకునే ముందు కథ నచ్చలేదని చెప్పడానికి రకరకాల పేర్లు పెట్టేదానిని. ఇప్పుడు ఆ చాదస్తం మరింత ఎక్కువైంది.. అంతే తేడా" అని చెప్పింది.
*  కమలహాసన్ తాను ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'విశ్వరూపం 2' చిత్రం షూటింగును ఇటీవలే పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ పనులను అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం కమల్ అమెరికాలో వున్నారు. జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.
*  విశాల్, అర్జున్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'అభిమన్యుడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 26న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు.
*  నిన్నటి తరం కథానాయిక సుమలత, కన్నడ నటుడు అంబరీష్ ల  తనయుడు అభిషేక్ గౌడ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నటన, మార్షల్ ఆర్ట్స్ లలో అభిషేక్ శిక్షణ తీసుకుంటున్నాడు. 
Go Back to Shorts
samantha
Kamal Haasan
Vishal
sumalatha

More Telugu News