అంతసీన్ లేదు.. నేను అరెస్ట్ కాలేదు.. ఆ వార్తలు నమ్మకండి: మహేశ్ కత్తి వీడియో
- ఫేస్‌బుక్‌లో మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహేశ్ కత్తి
- పోలీసులకు ట్విట్టర్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు
- ఎంత వరకు మాట్లాడితే మనకి ఏమి కాదో ఆ విషయాలు నాకు తెలుసు
- నాకు నా హక్కులు తెలుసు- మహేశ్ కత్తి
నేను మోదీని నరహంతకుడు అన్నానని, అరెస్టు చేయండని ట్విట్టర్‌లోనే ఫిర్యాదు చేశారు. నన్ను అరెస్టు చేయలేదు. బీ కూల్.. నన్ను ఎవ్వరూ అరెస్టు చేయలేరు.. నేను స్వతంత్రుడిని.. ఎంత వరకు మాట్లాడితే మనకి ఏమి కాదో ఆ విషయాలు నాకు తెలుసు. నాకు నా హక్కులు తెలుసు. అసలు అరెస్టుకే ఆస్కారం లేదు. ఇందాకా ఇద్దరు, ముగ్గురు మిత్రులు నాకు ఫోన్ చేశారు. మీడియాలో నేను అరెస్టయ్యానని వార్తలు వస్తున్నాయ"ని చెప్పారు.