'కాంచన' సీక్వెల్ తో లారెన్స్ .. కథానాయికగా 'ఒవియా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన' సీక్వెల్ తో లారెన్స్ .. కథానాయికగా 'ఒవియా!

  • 'కాంచన 3'తో బిజీగా లారెన్స్ 
  • కాజల్ ప్లేస్ లో ఒవియా 
  • ప్రాజెక్టుపై పెరుగుతోన్న ఆసక్తి
హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా తన పాత్రను పండించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. 'ముని' సీక్వెల్ గా ఆయన తెరకెక్కించిన 'కాంచన 2' భారీవిజయాన్ని సాధించింది. దాంతో ఆయన నుంచి రానున్న మరో హారర్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కాంచన 2' కి సీక్వెల్ గా 'కాంచన 3' సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు.

ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇందులో కథానాయికగా కాజల్ కనిపించనుందనే టాక్ వచ్చింది. కానీ ఆమె ప్లేస్ లో 'ఒవియా' నటిస్తోందని తెలుస్తోంది. తమిళ బిగ్ బాస్ తో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న 'ఒవియా' కోసం అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె 'కాంచన 3' చేస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.         
lawrence
oviya

More Telugu News