ఐఎండీబీ టాప్ లిస్టులో 'బాహుబ‌లి' తారాగ‌ణం... ప్ర‌భాస్‌కి ఆరో స్థానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఎండీబీ టాప్ లిస్టులో 'బాహుబ‌లి' తారాగ‌ణం... ప్ర‌భాస్‌కి ఆరో స్థానం!

  • నాలుగో స్థానంలో త‌మ‌న్నా, ఎనిమిదో స్థానంలో అనుష్క‌
  • మొద‌టి మూడు స్థానాల్లో ఖాన్ త్ర‌యం
  • స్టార్‌డ‌మ్‌, పేజివ్యూల ఆధారంగా జాబితా త‌యారీ
2017 సంవ‌త్స‌రంలో వివిధ హీరో, హీరోయిన్ల‌కు వ‌చ్చిన పేజి వ్యూలు, స్టార్‌డ‌మ్‌, సెర్చ్‌ల ఆధారంగా ఇంట‌ర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) టాప్ 10 న‌టీన‌టుల జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో బాహుబ‌లి చిత్ర‌ తారాగ‌ణం చోటు సంపాదించుకుంది. 'బాహుబ‌లి 2' చిత్రంలో త‌మ‌న్నా పాత్ర‌ నిడివి పెద్దది కాకపోయినప్పటికీ, ఆమె నాలుగో స్థానంలో నిల‌వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. హీరో ప్ర‌భాస్ ఆరో స్థానంలో, అనుష్క శెట్టి ఎనిమిదో స్థానంలో నిలిచి ద‌క్షిణాది సినిమా విజ‌యకేత‌నం ఎగుర‌వేశారు.

ఈ జాబితాలో మొద‌టి మూడు స్థానాల్లో వరుసగా షారుక్ ఖాన్‌, ఆమిర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్‌లు ఉన్నారు. ఐదో స్థానంలో ఇర్ఫాన్ ఖాన్, ఏడో స్థానంలో అనుష్క శ‌ర్మ‌, తొమ్మిదో స్థానంలో హృతిక్ రోష‌న్‌, ప‌దో స్థానంలో క‌త్రినా కైఫ్ నిలిచారు.
prabhas
baahubali
anushka
Anushka Sharma

More Telugu News