'మిడిల్ క్లాస్ అబ్బాయి'లోను సాయిపల్లవి తెలంగాణ అమ్మాయే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మిడిల్ క్లాస్ అబ్బాయి'లోను సాయిపల్లవి తెలంగాణ అమ్మాయే!

  • నాని హీరోగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • వరంగల్ నేపథ్యంలో సాగే కథ 
  • తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్న సాయిపల్లవి 
  • ఈ నెల 21వ తేదీన విడుదల    
'ఫిదా' సినిమాలో తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. తెలుగు భాష నేర్చుకుని .. తెలంగాణ యాస మీద ఆసక్తిని పెంచుకుని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. సాయిపల్లవి నటన .. ఆమె పలికిన తెలంగాణ యాస ఆ పాత్రను ప్రేక్షకుల మనసుకు దగ్గరగా తీసుకెళ్లాయి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె ఓ పది హిట్ సినిమాలు చేసినంతటి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

 అలాంటి సాయిపల్లవి 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లోను తెలంగాణ అమ్మాయిగానే కనిపించనుందట. ఈ సినిమా కథ వరంగల్ నేపథ్యంగా కొనసాగుతుంది. నాయకా నాయికలు ఇద్దరూ తెలంగాణకి చెందినవారే. అయితే ఒకే తరహా పాత్ర అనిపించకూడదనే ఉద్దేశంతో, తెలంగాణ యాస మాత్రం మాట్లాడదట. ఈ సినిమాలోను తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.    
sai pallavi
nani

More Telugu News