భూసార పరీక్ష ప్రాముఖ్య‌త‌ను ప్ర‌చారం చేస్తున్న అక్ష‌య్ కుమార్‌... వీడియో మీకోసం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూసార పరీక్ష ప్రాముఖ్య‌త‌ను ప్ర‌చారం చేస్తున్న అక్ష‌య్ కుమార్‌... వీడియో మీకోసం!

  • వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌కు ప్రచార‌క‌ర్త‌గా నియామ‌కం
  • రైతుల్లో అవ‌గాహ‌న కోసం ప్ర‌క‌ట‌న‌లు
  • వీడియో షేర్ చేసిన న‌టుడు
మ‌నిషి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకుంటున్న‌ట్లు గానే, నేల‌కు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు భూసార ప‌రీక్ష‌లు చేయించాల‌ని బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న వివిధ వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌కు ఆయ‌న‌ను ప్ర‌చార‌క‌ర్త‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న న‌టించిన ఓ ప్ర‌క‌ట‌న‌ను అక్ష‌య్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు మ‌రికొన్ని త్వ‌ర‌లో బుల్లితెర మీద ప్ర‌సారం కానున్నాయి. వీటి ద్వారా ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి క్రిషి సించాయ్ యోజ‌న‌, పరంప‌రాగ‌త్ క్రిషి వికాస్ యోజ‌న్ వంటి ఉప‌యోగ‌క‌ర రైతు ప‌థ‌కాల గురించి వ్య‌వ‌సాయ‌దారుల‌కు, చిన్న‌స్థాయి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం యోచించింది.
akshay kumar
soil test
twitter
video

More Telugu News