'2.0' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'2.0' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • గ్రాఫిక్స్ పనుల్లో '2.0'
  • జనవరి 26న టీజర్ రిలీజ్ 
  • ఏప్రిల్ 14న సినిమా విడుదల
రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషించిన '2.0' కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి, 20 కోట్ల ఖర్చుతో ఆడియో ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తిచేసుకునే పనిలో వుంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న పనులు పూర్తికానందున, ఆ సమయానికి థియేటర్స్ కి తీసుకురాలేకపోతున్నారు.

ఆ రోజు కోసం ఎదురుచూస్తూ వచ్చిన అభిమానులు నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదే రోజున వివిధ భాషల్లో టీజర్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. ఫస్టు టీజర్ తోనే భారీగా అంచనాలు పెరిగేలా .. అందరూ దీని గురించే మాట్లాడుకునేలా టీజర్స్ ను కట్ చేస్తున్నారట. తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.         
rajanikanth
akshay kumar

More Telugu News