Pawan Kalyan: ఇక ఇరు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తాను: పవన్ కల్యాణ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తాను త్వరలోనే మూడు విడతలుగా పర్యటించనున్నట్లు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రోజు ఆయన ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. తన మొదటి పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన చేస్తానని చెప్పారు.
రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని అన్నారు. ఇక సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాల వేదికగా మూడో విడత పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం యువత నిరాశతో ఉందని, యువతను జాగృతం చేసేందుకు 'చలో రే చలో' గీతాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.