శంకర్ '2.ఓ' రిలీజ్ డేట్ మారింది.. జనవరి 26 నుంచి ఏప్రిల్ 27కు మార్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంకర్ '2.ఓ' రిలీజ్ డేట్ మారింది.. జనవరి 26 నుంచి ఏప్రిల్ 27కు మార్పు

  • '2.ఓ' వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం   
  • విడుదల తేదీని మార్చిన లైకా ప్రొడక్షన్స్
  • 2018 ఏప్రిల్ 27న విడుదల
రజనీకాంత్‌, అక్షయ్ కుమార్, ఆమీ జాక్సన్ ప్రధాన తారాగణంతో ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘2.ఓ’ విడుదల వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇవి వీలైనంత త్వరగా పూర్తి చేసి 2018 జనవరి 26న విడుదల చేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు అప్పటికి పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది.

 2018 ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తామని వెళ్లడించింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘‘అత్యాధునిక హంగులతో అద్భుతమైన 3డీ చిత్రంగా ‘2.ఓ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్‌. అందుకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. 2018 ఏప్రిల్‌ నెలలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాం. అప్పటికి అన్నీ పూర్తవుతాయి’’ అని పేర్కొంది. కాగా, గతంలో ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేస్తామని తెలిపింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ట్రైలర్ అయినా విడుదలవుతుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
Rajinikanth
akshay kumar
robo 2.0
shankar 2.0

More Telugu News