mimi choi: మేకప్ మ్యాజిక్: వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే... మీరూ చూడండి!

షార్ట్స్‌లో చూడండి
'ఆప్టికల్ ఇల్యూజన్' ఫోటోలతో కెనడాలోని వాంకోవర్ సిటీకి చెందిన మిమిచోయ్ అనే యువతి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఊహించని విధంగా మేకప్ వేసుకుని సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆమె ఫోటోలను చూసినవారెవరైనా సరే, అవి ఫోటోషాప్ ఫోటోలని పొరబడేంతగా ఉండడం విశేషం.

ఆమె ఇన్ స్టా గ్రాం ఖాతాకు సుమారు 5,000 మంది ఫాలోయర్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆమె ఫోటోలను తొలిసారి చూసిన వారికి అవి అర్థం కావు. అయితే ఆ ఫోటోలను పదేపదే చూస్తే ఆశ్చర్యానికి లోనుకావడం సహజం. ఈ ఆర్ట్ ను ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. ముఖానికి, శరీరానికి మేకప్ వేసుకోవడం ద్వారా ఆమె ముఖం మాయమైనట్టు, మరోసారి ఆమె శరీరం అదృశ్యమైన భ్రాంతిని కల్పిస్తుంది. దీంతో షోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి. 
Go Back to Shorts
mimi choi
optical illusion
social media

More Telugu News