అనుభవాలే పాఠాలు .. ముందడుగు వేస్తూనే వుంటాను: నటి గౌతమి
- అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాను
- అందుకు ముందడుగు వేస్తాను
- ప్రతి పాఠం నుంచి లాభాన్ని పొందుతాను
- కేన్సర్ నుంచి ఆత్మ విశ్వాసాన్ని లాభంగా పొందాను
" ఏ విషయంలోనైనా ఒక విధంగా ముందుకు వెళ్లడానికే చూస్తాను. అలా 'గోల్' చేరుకోలేనప్పుడు మరో మార్గం ద్వారా అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాను. అలా ముందడుగు వేస్తూ వెళుతుంటాను తప్ప .. వెనకడుగు వేయను. ఇంతవరకూ వెనకడుగు వేయవలసిన అవసరం రాలేదు. నేను నేర్చుకున్న ప్రతి పాఠం నుంచి .. ప్రతి అనుభవం నుంచి నేను ఏదో ఒక లాభం పొందాలి. కేన్సర్ రావడం వలన .. దాని నుంచి నేను ఆత్మవిశ్వాసాన్ని లాభంగా పొందగలిగాను. ఆ ఆత్మ విశ్వాసాన్ని ఎంతోమందిలో పెంపొందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.