srivishnu: యూఎస్ లో దూసుకుపోతోన్న 'మెంటల్ మదిలో'

షార్ట్స్‌లో చూడండి
యూత్ కు .. ఫ్యామిలీ ఆడియన్స్ లో కనెక్ట్ అయ్యే కథలను తెరపైకి తీసుకురావడానికి నిర్మాత రాజ్ కందుకూరి ఎంతో ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. 'పెళ్లిచూపులు' తరువాత ఆయన నిర్మించిన చిత్రమే 'మెంటల్ మదిలో'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు కథానాయకుడిగా చేసిన ఈ సినిమా ద్వారా, నివేదా పేతురాజ్ .. అమృతా శ్రీనివాసన్ కథానాయికలుగా పరిచయమయ్యారు.

ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఆదరణ పొందుతోంది. అమెరికాలో 70 స్క్రీన్స్ పై రిలీజైన ఈ సినిమా .. ప్రతి చోటా మంచి వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతోంది. పబ్లిక్ టాక్ తో రెండవ వారంలో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. 'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలతో శ్రీవిష్ణుకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోగా ఆయన స్థాయిని 'మెంటల్ మదిలో' మరింత పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
Go Back to Shorts
srivishnu
niveda
amrutha

More Telugu News