క‌త్రినా కైఫ్‌లా క‌నిపిస్తున్న 'దంగ‌ల్' హీరోయిన్‌.... నెటిజ‌న్ల కామెంట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌త్రినా కైఫ్‌లా క‌నిపిస్తున్న 'దంగ‌ల్' హీరోయిన్‌.... నెటిజ‌న్ల కామెంట్లు!

  • ఫొటోలు పోస్ట్ చేసిన ఫాతిమా స‌నా షేక్‌
  • క‌రీనా, క‌త్రినాలతో పోల్చిన నెటిజ‌న్లు
  • 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'లో న‌టిస్తున్న ఫాతిమా
'దంగ‌ల్' సినిమాలో బాయ్ క‌ట్‌లో కనిపించిన ఫాతిమా స‌నా షేక్‌.. ఆ చిత్ర విజ‌యం త‌ర్వాత ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు పోస్ట్ చేస్తూ తాను అందాల హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోన‌ని నిరూపించుకుంది. కొన్నిసార్లు అభ్యంత‌ర‌క‌రంగా ఉండే ఫొటోలు కూడా పోస్ట్ చేసి విమ‌ర్శ‌ల పాలైంది. అయితే ఇటీవ‌ల ఆమె పోస్ట్ చేసిన ఫొటోల‌కు నెటిజ‌న్లు కొత్త అభిప్రాయాన్ని జోడించారు.

చీర‌క‌ట్టులో సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఉన్న కొన్ని ఫొటోల‌ను ఫాతిమా పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అచ్చం క‌త్రినా కైఫ్‌లాగే క‌నిపిస్తోంది. ఇంకో ఫొటోలో అయితే క‌రీనా క‌పూర్‌, క‌త్రినాలు క‌ల‌బోసిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు విసిరారు. ప్రస్తుతం ఈ భామ 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌' సినిమాలో న‌టిస్తోంది.
katrina kaif
dangal
fatima sana

More Telugu News