సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసో చెప్పు?: రాజాసింగ్ ను నిలదీసిన కత్తి మహేష్
- సంజయ్ లీలా భన్సాలీ కుటుంబం గురించి మీకేమీ తెలియదు
- అసలు ఆయన ఫ్యామిలీ గురించి తెలిస్తే చెప్పండి
- 'నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారా?' అన్న మహేష్
'పద్మావతి ఇతిహాస్ (చరిత్ర) లో భాగం, అలాంటి ఇతిహాస్ ను మారుస్తారా? అది తప్పుకాదా? సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి మీకేమైనా తెలుసా? ' అని అడిగారు. దీంతో కల్పించుకున్న కత్తి మహేష్... 'సరే ఇక్కడెవరికీ సంజయ్ లీలా భన్సాలీ కుటుంబం గురించి తెలియదు... మీరు చెప్పండి.. అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు' అన్నారు.
దీంతో రాజాసింగ్ మౌనం వహించారు. ఇక్కడ సీనులో లేని మనుషుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అలవాటైపోయిందని కత్తిమహేష్ మండిపడ్డాడు. దీంతో రాజాసింగ్ వివరణ ఇస్తూ, నేను ఇప్పటికిప్పుడు చెప్పలేనని అన్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కత్తి మహేష్ 'చరిత్రలో ఉందని చెబుతున్న ఓ మహిళ గురించి మాట్లాడుతూ... ఇప్పుడున్న మహిళలందర్నీ అవమానిస్తున్నార'ని ఆగ్రహం వ్యక్తం చేశాడు.