లవర్స్ కు తోడుగా వెళ్లి లవ్ లో పడ్డాము... వాళ్లు పెళ్లి చేసుకోలేదు, మేము మాత్రం చేసుకున్నాం!: 'జై లవకుశ' దర్శకుడు బాబీ లవ్ స్టోరీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లవర్స్ కు తోడుగా వెళ్లి లవ్ లో పడ్డాము... వాళ్లు పెళ్లి చేసుకోలేదు, మేము మాత్రం చేసుకున్నాం!: 'జై లవకుశ' దర్శకుడు బాబీ లవ్ స్టోరీ!

  • 'జై లవకుశ' విజయంతో మరింత పేరు
  • చెస్ చాంపియన్ హారిక సోదరి అనూషను ప్రేమించిన బాబీ
  • అనూష కోసమే హైదరాబాద్ కు
  • ఆసక్తికర విషయం చెప్పిన బాబీ
ఎన్టీఆర్ హీరోగా 'జై లవకుశ' చిత్రానికి దర్శకత్వం వహించి, యువ దర్శకుడిగా మరింత పేరు తెచ్చుకున్న బాబీ, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన సొంత లవ్ స్టోరీ గురించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. చెస్ చాంపియన్ హారిక సోదరి అనూషను కులాంతర వివాహం చేసుకున్నానని అన్నాడు. తన మిత్రుడు ఒకడు లవర్ ను కలుసుకోవడానికి వెళుతూ నన్ను తోడుగా తీసుకు వెళ్లేవాడని, ఆ అమ్మాయి అనూషను వెంట తెచ్చుకునేదని గుర్తు తెచ్చుకున్నాడు.

ప్రేమికులిద్దరూ వాళ్ల పనిలో వాళ్లుంటే, తాము కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లమని, అలా అలా పరిచయం పెరిగి, స్నేహంగా మారి, హృదయాలు దగ్గరయ్యాయని అన్నాడు. ఆపై కులాలు వేరు కావడంతో, ఇంట్లో చెబితే, స్థిరపడిన తరువాత పెళ్లి గురించి ఆలోచించమని సలహా ఇచ్చారని, తానసలు అనూష కోసమే హైదరాబాద్ వచ్చానని అన్నాడు. అనూషకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో, అప్పటికే 'భద్రాద్రి' చిత్రానికి కథ అందించిన పరిచయంతో నటుడు శ్రీహరికి విషయం చెప్పగా, అనూష కుటుంబానికి దగ్గర బంధువైన చలపతిరావుతో మాట్లాడి తమ పెళ్లిని దగ్గరుండి చేయించాడని చెప్పాడు. ఎవరి ప్రేమకోసమైతే, తోడుగా తాము వెళ్లామో, వారిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోలేదని అన్నాడు.
boby
niharika
srihari
jai lavakusa director

More Telugu News