Pawan Kalyan: నిస్వార్థంగా సేవలు చేస్తోన్న ప్రతీ భారతీయుడికీ నాకొచ్చిన‌ అవార్డు అంకితం: పవన్‌ క‌ల్యాణ్‌

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న‌ ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఐఈబీఎఫ్‌) ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ అందుకున్న విష‌యం తెలిసిందే. త‌న‌ రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఐఈబీఎఫ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 'భారత్‌లో పెట్టుబ‌డుల‌కు అవకాశాలు' అనే అంశంపై మాట్లాడారు. ఇండియాలో ధనవంతులు, పేదవారు ఇద్దరికీ చోటు ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కాగా నిన్న తాను అందుకున్న అవార్డును నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతీ భారతీయుడికీ అంకితం ఇస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
landon
janasena

More Telugu News