పెళ్లి విష‌యం గురించి స్పందించిన కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి విష‌యం గురించి స్పందించిన కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌

  • పాత స‌మాధానాన్నే కొత్త‌గా చెప్పిన బాలీవుడ్ న‌టుడు
  • త‌న పెళ్లి వ‌ల్ల ఇత‌రుల‌కు ఉన్న‌ లాభ‌మేంటో అర్థంకాట్లేద‌ని వ్యాఖ్య‌
  • ప్ర‌స్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నాన‌న్న స‌ల్మాన్‌
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పాల్గొన్న అన్ని ఇంట‌ర్వ్యూల్లోనూ అత‌ని పెళ్లి గురించి ప్ర‌శ్న‌లు అడుగుతారు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌ల్మాన్, రోమేనియా మోడ‌ల్ ఇలియా వాంటూర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు గ‌తంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ విష‌యానికి సంబంధించి ఏ ఇంట‌ర్వ్యూలోనూ స‌ల్మాన్ నోరు జార‌లేదు. అయిన‌ప్ప‌టికీ అత‌ని పెళ్లి గురించిన ప్ర‌శ్న‌లు అడుగుతూనే ఉన్నారు.

ఇటీవ‌ల ఓ న్యూస్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా స‌ల్మాన్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. దానికి ఆయ‌న ఎప్పుడూ చెప్పే స‌మాధానాన్నే కొత్త‌గా చెప్పారు. `నా పెళ్లి గురించి జ‌నాలు ఆత్రుత ప‌డ‌టంపై నాకు ఆనందంగా ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల వాళ్ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటో నాకు అంతుచిక్క‌డం లేదు. ఈ ప్ర‌శ్న‌కు నా ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.

అవున‌ని గానీ, లేద‌ని గానీ, తెలియ‌దు అని గానీ నేను స‌మాధానం చెప్ప‌లేను. జ‌ర‌గాల‌ని ఉంటే జ‌రుగుతుంది.. లేదంటే లేదు..ఏదేమైనా నా వ‌ర‌కు నేను చాలా సంతోషంగా ఉన్నా!` అన్నారు. గ‌తంలో కూడా ఆయ‌న ఇలాంటి స‌మాధానాలే చెప్పారు. పిల్ల‌లంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, కానీ పిల్ల‌ల‌తో పాటు వాళ్ల‌మ్మ కూడా వ‌స్తుంద‌ని, అలా జ‌ర‌గ‌కుండా ఉండే మార్గాలు చెప్పాల‌ని గ‌తంలో స‌ల్మాన్ కోరిన సంగ‌తి తెలిసిందే.
Salman Khan
katrina kaif
marriage
ek tha tiger
tiger zinda hai
interview

More Telugu News