విమానాన్ని ఢీకొట్టిన అడవి పంది.. గంటపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం!
- రన్‌వేపై విమానం టైరును ఢీకొట్టిన ముళ్లపంది
- ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన పైలట్
- గంట తర్వాత తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ చేసిన వైనం
విమానం గంటపాటు విశాఖ గగనతలంపైనే తిరిగి తిరిగి.. బయలుదేరిన విమానాశ్రయంలోనే ల్యాండ్ కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. విషయం తెలిసి పెను ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానాన్ని ఢీకొట్టింది ముళ్ల పంది అని అధికారులు తెలిపారు. రన్‌వేపైకి అది ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.