త్రివిక్రమ్ .. దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ .. దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలా?

  • త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్ 
  • 'అ ఆ' సినిమాకి మాత్రం మిక్కీ జె. మేయర్ కి ఛాన్స్ 
  • 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ కి అవకాశం 
  • ఎన్టీఆర్ మూవీ కూడా అనిరుథ్ కే!    
తెలుగులోని అగ్రదర్శకుల జాబితాలో త్రివిక్రమ్ ఒకరు .. అగ్ర సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. నిశ్శబ్దంగా .. ప్రశాంతంగా తనపని చేసుకుపోవడం త్రివిక్రమ్ స్టైల్. ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణాన్ని ఉత్సాహపరచడం దేవిశ్రీ ప్రసాద్ స్టైల్. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జల్సా' .. 'జులాయి' .. 'అత్తారింటికి దారేది' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. కథా కథనాల పరంగానే కాకుండా, ఆడియో పరంగా కూడా ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి.

 ఈ నేపథ్యంలో 'అ ఆ' సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె. మేయర్ కి త్రివిక్రమ్ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉండి ఉండటం అందుకు కారణం కావొచ్చని అనుకున్నారు. ఆ తరువాత సినిమా అయిన 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్టుకు కూడా అనిరుథ్ నే ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ .. దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలు వచ్చి ఉండొచ్చనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది చూడాలి మరి.       
trivikram
devisri prasad

More Telugu News