anjali: అంజలి మళ్లీ దెయ్యంగా వచ్చేస్తుందండోయ్!

షార్ట్స్‌లో చూడండి
'గీతాంజలి' సినిమాలో దెయ్యంగా కనిపించి నటన పరంగా అదరగొట్టేసిన అంజలి, త్వరలో మరోసారి దెయ్యంగా భయపెట్టేందుకు రెడీ అవుతోంది. తమిళంలో ఆమె 'బెలూన్' అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తోంది. సినీష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దెయ్యంగా ఆమె కనిపించనుంది. అంజలి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, జై .. జోకర్ గా కనిపించనున్నాడు.

 గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలోనూ ఆసక్తి వుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.       
Go Back to Shorts
anjali
jai

More Telugu News