ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాష్టీకం... ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం!..వీడియో చూడండి
- ఇండిగో విమానంలో న్యూఢిల్లీ వెళ్లిన రాజీవ్ కటియాల్
- గ్రౌండ్ సిబ్బందితో మాటామాటా
- కటియాల్ ను కిందపడేసి దాడి చేసిన ఇండిగో సిబ్బంది
అయితే, ఆయన 'నో ఎంట్రీ జోన్'లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. దీంతో ఆయనతో వారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దీనికి ‘‘మీ పని మీరు చూసుకోండి’’ అంటూ సమాధానం చెప్పి వెళ్లి పోతున్న ఆయనను, వెనుకకి లాగేసిన సిబ్బంది, కిందపడేసి, ఆయన తలపై ఒకడు కాలు పెట్టగా, మరొకడు ఆయన ముఖంపై గుద్దాడు. కొంతసేపటి తరువాత మరొక వ్యక్తి వచ్చి వారి నుంచి అతనిని విడిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక టీవీ ఛానెల్ ప్రసారం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.