vijayashanthi: సామాన్య కార్య‌క‌ర్త‌గానే ప‌ని చేస్తా!: రాహుల్ తో విజయశాంతి

షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో విజ‌య‌శాంతి భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తాను పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త‌గానే ప‌ని చేస్తాన‌ని రాహుల్‌తో విజ‌య‌శాంతి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కుంతియా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం విజ‌య‌శాంతి ప‌నిచేస్తార‌ని అన్నారు. రాహుల్‌ని విజ‌య‌శాంతి భేటీ అయిన నేప‌థ్యంలో ఆమెకు ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వనున్నట్టు ప్ర‌చారం జరుగుతోంది.   
Go Back to Shorts
vijayashanthi
delhi
Congress

More Telugu News