మెగా హీరోతో మల్టీ స్టారర్ కి 'సై' అన్న మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా హీరోతో మల్టీ స్టారర్ కి 'సై' అన్న మహేశ్ బాబు!

  • వరుస సినిమాలతో బిజీగా మహేశ్ బాబు 
  • తనదైన పంథాలో ముందుకు వెళుతోన్న తేజు 
  • ఇద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రూపొందే ఛాన్స్ ఉందంటూ టాక్
ఒక వైపున మహేశ్ బాబు వరుస ప్రాజెక్టులను అంగీకరిస్తూ దూసుకెళుతున్నాడు. మరో వైపున సాయిధరమ్ తేజ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక  సినిమా వచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. దిల్ రాజు మనవడు 'అర్చిత్' పుట్టినరోజు వేడుకలో జరిగిన మాటలే ఈ టాక్ రావడానికి కారణమయ్యాయి.

దిల్ రాజు మనవడు పుట్టినరోజు వేడుకకు మహేశ్ బాబు .. సాయిధరమ్ తేజ్ .. కల్యాణ్ రామ్ హాజరయ్యారు. అలాగే వంశీ పైడిపల్లి .. హరీశ్ శంకర్ కూడా వచ్చారు. మాటల సందర్భంలో "సాయిధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ చేయవలసి వస్తే చేస్తారా?" అని దర్శకుడు వంశీ పైడిపల్లి .. మహేశ్ బాబును అడిగారట.  "మీరు సరైన కథ తీసుకుని రండి .. నేను తప్పకుండా చేస్తాను" అని మహేశ్ బాబు అన్నారట. అప్పటి నుంచి ఈ వార్త జోరుగా షికారు చేస్తోంది.     
Mahesh Babu

More Telugu News