పీవీ సింధు చేసిన ఆరోపణలపై స్పందించిన ఇండిగో యాజమాన్యం!
- పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారు
- ఆ అధిక లగేజీని కార్గోలోకి మారుస్తామని సింధుకి చెప్పాం
- మొదట ఒప్పుకోలేదు.. తర్వాత ఒప్పుకున్నారు.. అంతే జరిగింది
అయితే, సింధు చేసిన ఆరోపణలపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. పీవీ సింధునే తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేసింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని పేర్కొంది. తాము ఆ అధిక లగేజీని కార్గోలోకి మారుస్తామని సింధుకి చెప్పామని తెలిపింది. మొదట లగేజీని కార్గోలోకి తరలించేందుకు సింధు అంగీకరించలేదని, చాలాసార్లు కోరిన అనంతరం కార్గోలోకి తరలించేందుకు సింధు అంగీకరించారని ఇండిగో యాజమాన్యం వివరణ ఇచ్చింది. కాగా, పీవీ సింధు ప్రధానంగా ఆరోపణ చేసిన అజితేజ్ అనే వ్యక్తి గురించి ఇండిగో ప్రస్తావించలేదు.