'సాహో' షూటింగ్ కి మొబైల్స్ తీసుకురావద్దని చెప్పేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' షూటింగ్ కి మొబైల్స్ తీసుకురావద్దని చెప్పేశారట!

  • షూటింగ్ దశలో 'సాహో'
  • నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబీలో 
  • అక్కడ కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ
ఈ మధ్య కాలంలో తమ సినిమాకి సంబంధించిన విజువల్స్ .. వీడియోలు బయటికి రాకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా మొబైల్స్  అందుబాటులో ఉండటం వలన ఆయా సినిమాలకి సంబంధించిన హీరో హీరోయిన్స్ లుక్స్  తో పాటు .. కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. దాంతో అధికారికంగా రిలీజ్ చేసే లోపే అవి నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

 అందువలన 'సాహో' సినిమాకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఫలితంగానే హైదరాబాద్ షెడ్యూల్ కి సంబంధించి ఒక్క స్టిల్ కూడా బయటికి రాకుండా చూసుకోగలిగారు. ఇక త్వరలో 'అబుదాబీ'లో షూటింగ్ మొదలు కానుంది. ఇది చాలా కీలకమైన మేజర్ షెడ్యూల్ కావడంతో .. లొకేషన్ కి ఎవరూ మొబైల్స్ తీసుకురావద్దని ముందుగానే చెప్పేశారట. మొత్తానికి 'సాహో' టీమ్ ఈ విషయంలో పూర్తి దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది కదూ?   
prabhas
shraddha kapoor

More Telugu News