'రోబో 2.0' మ‌రో పోస్ట‌ర్‌... భ‌య‌పెడుతున్న అక్ష‌య్ కుమార్ లుక్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రోబో 2.0' మ‌రో పోస్ట‌ర్‌... భ‌య‌పెడుతున్న అక్ష‌య్ కుమార్ లుక్‌

  • పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్న అక్ష‌య్ న‌ట‌విశ్వ‌రూపం
  • డాక్ట‌ర్ రిచ‌ర్డ్స్ పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ హీరో
  • ఆస‌క్తి పెంచుతున్న పోస్ట‌ర్‌
'రోబో 2.0' విడుద‌ల తేదీ మీద స్ప‌ష్ట‌త ఇంకా రాక‌పోయినా, చిత్ర బృందం విడుద‌ల చేస్తున్న పోస్ట‌ర్లు మాత్రం అభిమానుల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ పోస్ట‌ర్ల ప‌రంప‌ర‌లో భాగంగా మ‌రో పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈసారి సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న అక్ష‌య్ కుమార్ లుక్ తో కూడిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఇప్పటికే 'డాక్ట‌ర్ రిచ‌ర్డ్స్' పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ లుక్‌, గెట‌ప్ గురించి పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసినా... ఈ పోస్ట‌ర్‌లో అక్ష‌య్ ప‌లికించిన హావ‌భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమాలో అక్ష‌య్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూపించా‌డన‌డానికి ఈ ఒక్క పోస్ట‌ర్ చాల‌ని అభిమానులు అంటున్నారు.
robo 2.0
akshay kumar
dr richards
rajnikanth
amy jackson
shankar

More Telugu News