సంక్రాంతి బరిలోకి దిగేందుకు 'భాగమతి' కూడా తయారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతి బరిలోకి దిగేందుకు 'భాగమతి' కూడా తయారు!

  • 'భాగమతి'గా రానున్న అనుష్క 
  • యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం 
  • దర్శకుడిగా 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్
అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' సినిమా తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో అఖిల్ మూవీ 'హలో' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'హలో' మూవీకి మరే సినిమా పోటీగా రాకుండా నాగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ కారణంగా యూవీ క్రియేషన్స్ వారు 'భాగమతి'ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే సంక్రాంతికి 'జై సింహా' .. 'అజ్ఞాతవాసి' తో పాటు 'టచ్ చేసి చూడు' .. సూర్య డబ్ మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు 'భాగమతి' కూడా సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా సంక్రాంతి బరిలోకి దిగుతూ యూవీ క్రియేషన్స్ వారు హిట్ కొడుతున్నారు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి మరి.  
anushka

More Telugu News