గౌతమ్ మీనన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గౌతమ్ మీనన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అనుష్క

  • 'భాగమతి' సినిమాను పూర్తిచేసిన అనుష్క 
  • ఆమెకి కథ వినిపించిన గౌతమ్ మీనన్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో చిత్రీకరణ  
'బాహుబలి 2' సమయంలో ఒప్పుకున్న 'భాగమతి' సినిమానే అనుష్క పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె తెలుగులో గానీ, తమిళంలో గాని ఒక్క ప్రాజెక్టును కూడా అంగీకరించలేదు. ఇదే విషయాన్ని గురించి ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావించగా, తన స్థాయికి తగిన పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పింది. అయితే తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను సిద్ధం చేసుకున్న గౌతమ్ మీనన్, ఆ కథను అనుష్కకు వినిపించాడట. కథ .. కథనాలు కొత్తగా అనిపించడం వలన, ఇంతకుముందు ఆ తరహా పాత్రను తాను చేయకపోవడం వలన అనుష్క ఓకే చెప్పిందని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.    
anushka

More Telugu News