రోబో 2.0 ఆడియో విడుదల వేడుక హైలైట్స్... ఫొటోలు, వీడియోలు
- అదిరిపోయిన డ్యాన్సులు, నటీనటుల ఎంట్రీలు
- దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుక
- తెలుగు వ్యాఖ్యాతగా రానా
వేడుకలో భాగంగా రజనీకాంత్‌ని ఓ తెలుగు డైలాగ్ చెప్పాలని రానా కోరాడు. దానికి రజనీ `భాషా` చిత్రంలోని `నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే` అనే డైలాగ్ చెప్పడంతో సభ చప్పట్లతో దద్దరిల్లింది. అక్షయ్ కుమార్ తన ఎంట్రీని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అలాగే ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసిన వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలు, పోస్టులు, ఫొటోలు పెట్టారు.