'2.0' ఆడియో ఈవెంట్ టికెట్ ధర రూ.60 వేలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'2.0' ఆడియో ఈవెంట్ టికెట్ ధర రూ.60 వేలు!

  • శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న '2.0'
  • రజనీ .. అక్షయ్ ఫ్యాన్స్ లో పెరుగుతోన్న ఆసక్తి
  • ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో ఆడియో ఈవెంట్ 
  • జనవరి 25వ తేదీన సినిమా విడుదల    
శంకర్ దర్శకత్వంలో .. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో '2.0' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీన దుబాయ్ లోని 'బుర్జ్ ఖలీఫా' పార్క్ .. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి వేదికగా మారుతోంది.

 భారీ ఖర్చుతో అక్కడ జరగనున్న ఆడియో ఈవెంట్ ను చూడటానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. దాంతో ఒక్కో టికెట్ ధర రూ.60 వేలు పలుకుతోందట. అయినా టికెట్స్ ను కొనడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదని చెబుతున్నారు. ఒక దక్షిణాది సినిమాకి సంబంధించి .. ఈ ప్రదేశంలో ఈ స్థాయిలో ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనేది యూనిట్ వర్గాలవారు చెబుతోన్న మాట. జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది.   
rajani
akshay

More Telugu News