ఫోన్ సాధార‌ణ వ్య‌క్తిది... నంబ‌ర్ ర‌వితేజ‌ది... `రాజా ది గ్రేట్` సినిమా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న ఓ వ్య‌క్తి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్ సాధార‌ణ వ్య‌క్తిది... నంబ‌ర్ ర‌వితేజ‌ది... `రాజా ది గ్రేట్` సినిమా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న ఓ వ్య‌క్తి!

  • సినిమాలో ఫోన్ నంబ‌ర్ చెప్ప‌డం వ‌ల్ల ప్రారంభ‌మైన క‌ష్టాలు
  • రోజుకి వంద‌ల్లో ఫోన్ కాల్స్‌
  • కాల్స్ బాధ త‌ట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్‌
ర‌వితేజ న‌టించిన `రాజా ది గ్రేట్‌` చిత్రంలో ఆయన త‌ల్లిగా న‌టించిన రాధిక.. త‌న కొడుకు ఫోన్ నెంబ‌రంటూ ఇచ్చే 8074545422 నెంబ‌ర్ గుర్తుందా? ఈ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసా?... విశాఖ జిల్లా ఆనంద‌పురం గ్రామానికి చెందిన లంక‌ల‌ప‌ల్లి గోపీ అనే వ్య‌క్తిది. అయితే సినిమా చూసిన వారిలో కొంత‌మంది ఇది ర‌వితేజ నెంబ‌ర్ అనుకుని డ‌య‌ల్ చేసి చూస్తున్నారు. అలా డ‌య‌ల్ చేసిన కాల్స్ అన్నీ వండ్రంగి వృత్తి చేసుకుంటూ సాధార‌ణ జీవితం గ‌డిపే గోపీకి వెళ్తున్నాయి.

సినిమా విడుద‌లైన నాటి నుంచి రోజుకి వంద‌ల కొద్దీ కాల్స్ వ‌స్తున్నాయ‌ని గోపీ చెబుతున్నాడు. `ఒక‌టీ.. రెండూ.. కాల్స్ అయితే ఓకే.. కానీ వందల్లో కాల్స్ వ‌స్తుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు` అని గోపీ అన్నాడు. కాల్స్ బాధ త‌ట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పాడు. ర‌వితేజ అభిమానులెవ‌రూ త‌న‌కు ఫోన్ చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు. ప‌రిస్థితి శ్రుతి మించితే అనుమ‌తి లేకుండా త‌న నెంబ‌ర్ సినిమాలో వాడుకున్నందుకు కేసు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు గోపీ చెప్పాడు.
raja the great
raviteja
phone number
radhika
gopi
vishaka

More Telugu News